- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
అమెరికా లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం
by Naveena |
X
దిశ, నిజామాబాద్ : ఈ నెల 5న అమెరికా లోని డలాస్ లో బతుకమ్మ, దసరా సంబరాలు 2024 పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక కార్యక్రమాల బోర్డ్ అడ్వయిజర్ ఆడెపు రోజా తెలిపారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ అఫ్ డల్లాస్ (టీపీఏడీ) తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో నిర్వహించనున్న..ఈ ఈవెంట్ కు ప్రముఖ సినీ నటి ప్రియాంక మోహన్ తో పాటు ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రామ్ మిర్యాల హాజరు కానున్నట్లు రోజా తెలిపారు. ప్రతి యేటా తమ అసోసియేషన్ తరఫున తెలుగు దనం ఉట్టిపడేలా, భక్తి శ్రద్ధలతో బతుకమ్మ, దసరా సంబరాలు నిర్వహిస్తామన్నారు. అమెరికాలో తాము నిర్వహించే ఈ ఉత్సవాలకు మంచి రెస్పాన్స్ ఉంటుందని ఆడెపు రోజా అన్నారు. ఉత్సవాల్లో పాల్గొనే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Advertisement
Next Story