బాన్సువాడ నియోజకవర్గంలో ఈదురు గాలుల బీభత్సం

by Sridhar Babu |

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలో ఆదివారం వీచిన ఈదురు గాలులు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. రుద్రూర్ మండలం అంబం గ్రామ శివారులో గల అంబం -రుద్రూర్ రహదారిపై బారడి పోచమ్మ ఆలయం సమీపంలో ఉన్న ఎన్నో ఏండ్ల ఊడల మర్రి చెట్టు నేల కొరిగింది. ఈదురు గాలి వీస్తోందని, వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నందున ఒక ఆటో, నాలుగు

ద్విచక్ర వాహనాలను ఆపిన ప్రయాణికులు చెట్టు నేల కొరగడాన్ని గమనించి అక్కడి నుండి పారిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదేవిధంగా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఈదురు గాలులకు కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. అదేవిధంగా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువుపై గల సోలార్ విద్యుత్ ఐమాస్ లైట్ నేలకూలింది.

Next Story

Most Viewed