'డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతీ వ్యక్తికి న్యాయం జరుగుతుంది'

by Vinod kumar |
డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతీ వ్యక్తికి న్యాయం జరుగుతుంది
X

దిశ, ఆర్మూర్: ఆడబిడ్డ పుట్టగానే ఆమె పేరు మీద రెండు లక్షల పిక్స్ డిపాజిట్ చేస్తామని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సోమవారం రాత్రి వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు చాలా లబ్ది చేసేలా ఉందన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు నియోజకవర్గంలోని యువతను గంజాయికి బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వెయ్యకపోతే పెన్షన్లు తీసేస్తామని మహిళలను భయందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లు తీసేవేసే దమ్ము, ధైర్యం ఎవ్వరికి లేదని బీజేపీని గెలిపిస్తే అర్హులందరికీ నూతనంగా మరికొన్ని పెన్షన్లు వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు.


రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతీ వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే పార్టీ మారమని గ్యారంటీ ఇస్తారా అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాలను రూపుమాపాలంటే బాల్కొండలో తప్పకుండా బీజేపీని గెలిపించాలని కోరారు. అనంతరం ఎర్గట్ల మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కులసంఘం సభ్యులు, వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు, మెండోరా మండలం వెల్గటూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు అన్నపూర్ణమ్మ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి, అశోక్, శ్రీధర్, ప్రశాంత్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed