అంగన్వాడి టీచర్లకు కనీస వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలి : వి.ప్రభాకర్

by Sumithra |
అంగన్వాడి టీచర్లకు కనీస వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలి : వి.ప్రభాకర్
X

దిశ, ఆర్మూర్ : సమస్యలు పరిష్కరించాలని గతఎనిమిది రోజులుగా సమ్మెచేస్తున్న అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి, వారికి కనీస వేతనం అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు వి.ప్రభాకర్ అన్నారు. సీపీఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు గత కొన్నిరోజులుగా చేస్తున్న సమ్మెకు సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు సంపూర్ణ మద్దతును సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు వి.ప్రభాకర్ జిల్లా నాయకులు బి.దేవారంలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాకముందు ఆనాడు ప్రగల్బాలు పలికిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్న గత పది సంవత్సరాలలో కేసీఆర్ అనేక రకాల ప్రజలను తీవ్ర ఇబ్బందులను పెడుతూ వారి హక్కులను కాల రాస్తున్నారని అన్నారు. మరో వైపు అంగన్వాడి టీచర్లు, ఆయాలు గత ఎనిమిది రోజులుగా వారి న్యాయమైన డిమాండ్లను సాధించాలని చేస్తున్న సమ్మె సీఎం కేసీఆర్ కు, ఇతర మంత్రులకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమానపనికి సమానవేతనం అమలు చేయాలని దాన్ని పక్కన పెట్టడం జరిగిందని అన్నారు. నేడు కేసీఆర్ లక్షల జీతాలను తీసుకుంటూ, కేవలం అరకొర వసతులతో చాలీచాలని జీతాలతో గడుపుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలను 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అదే విధంగా ఉద్యోగ భద్రతను కల్పించాలని, వారికి ఉన్నహక్కులను కల్పించాలని అన్నారు. వెంటనే కేసీఆర్ ప్రభుత్వం అంగన్వాడి టీచర్ల సమ్మెను విరమింపజేయించి వారి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపంతా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా జిల్లా నాయకులు ఏం.ముత్తెన్న, సారా సురేష్, సీఐటీయూ మండల నాయకులు కూతాడి ఎల్లయ్య, సీపీఎం మండల నాయకులు భూమన్న, ప్రజాపంథా డివిజన్ నాయకులు బి.కిషన్, ఎం.నరేందర్, అశోక్ రాజు, అరవింద్, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Next Story