నడిరోడ్డుపై కర్రలు విరిగేలా కొట్టుకున్న మందుబాబులు (వీడియో)

by Web Desk |
నడిరోడ్డుపై కర్రలు విరిగేలా కొట్టుకున్న మందుబాబులు (వీడియో)
X

దిశ, కామారెడ్డి: మద్యం మత్తులో కొందరు వీరంగం సృష్టించారు. ఆకతాయిల ఆగడాలతో సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొందరు ఆకతాయిలు చేసిన వీరంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలోని 3వ నంబర్ కల్లు దుకాణంలో ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడులు చేసుకున్నారు. అశోక్ నగర్ కాలనీలో నడిరోడ్డుపై పట్టపగలు ఈ దాడులు చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దాడులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకరిని రోడ్డుపై పడేసి ఒకరు చేతులతో ముఖంపై పిడిగుద్దులు గుద్దుతుండగా, మరొకరు కర్రతో కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాడు. ఓ మహిళ మరొక మైనర్ అమ్మాయి పక్కనే నిల్చొని చూస్తున్నారు. మైనర్ అమ్మాయి చేతిలో లావుపాటి కర్ర కూడా ఉన్నట్టుగా వీడియోలో తెలుస్తోంది. పట్టపగలు జరిగిన ఈ దాడిని ఆపకుండా అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. కల్లు దుకాణానికి వచ్చే ఆకతాయిలు ఇలా వీరంగం సృష్టిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని, కల్లు దుకాణాన్ని అక్కడినుంచి తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Next Story

Most Viewed