నిబంధనలు గాలికేనా..తీరుమారని గ్యాస్ ఏజెన్సీల పనితీరు..

by Disha Web Desk 20 |
నిబంధనలు గాలికేనా..తీరుమారని గ్యాస్ ఏజెన్సీల పనితీరు..
X

దిశ, గాంధారి : గ్యాస్ బండని ఇంటికి తీసుకువస్తే అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని వివిధ సామాజిక మాధ్యమాల్లో, సివిల్ ఫుడ్ సప్లై అధికారులు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. కానీ గాంధారి మండలకేంద్రంలో గ్యాస్ ఏజెన్సీలు మాత్రం చేతివాటం ప్రదర్శించి ఇంట్లో గ్యాస్ బండరాయిని వేయకుండా 20 రూపాయలు అదనంగా తీసుకొని ఇంటి ఆరు బయట వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లేకుండా 1127 రూపాయలకు ఒక సిలిండర్ వస్తుందని అధికారులు తెలిపారు. రవాణా, మెయింటెనెన్స్ చార్జీలు కలుపుకొని ఒక పది రూపాయలు లేదా 20 రూపాయలు చూసుకుంటే బాగుంటుందని ప్రజలు వాపోతున్నారు.

ఇప్పటికే 600 రూపాయలు 700 రూపాయలు ఉండే సిలిండర్ ఏకంగా 1200రూల దగ్గరికి చేరి ఇప్పుడు మాకు 1160 రూపాయలకు సిలిండర్ కొనే పరిస్థితి వచ్చిందని ప్రజలు తమ దీన పరిస్థితిని వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో పెట్టమని అడగగా అది మా పని కాదని ఇక్కడివరకు తేవడమే ఎక్కువ అని జవాబు ఇస్తున్నారని ప్రజలు తెలుపుతున్నారు. దీనిపై దిశా సదరు ఏజెన్సీ యజమాన్యానికి ఫోన్ చేసి వివరణ కోరగా అలా జరగవని ఒకవేల అలా జరిగితే జరగకుండా చూసుకుంటామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ లేకుండా 1127 రూపాయలకు ఒక సిలిండర్ వస్తే ఏజెన్సీ నిర్వాహకులు ఇంటి వద్ద వచ్చి 1160 రూపాయలకు డెలివరీ చేస్తున్నారు. ఒక్క సిలిండర్ పైన 33 రూపాయలు దీంట్లో ఏజెన్సీ రవాణా ఖర్చులు 23 రూపాయలు పోయినా లేదు 28 రూపాయలు పోయినా ఒక్క సిలిండర్ వెనక ఐదు రూపాయలు లాభమే కదా.. ఇది కాకుండా సిలిండర్ను వేసేవాళ్ళు అదనంగా 20 రూపాయలు ఎందుకు అడుగుతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారి సదరు ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే అలాంటివి జరగకుండా చూస్తామని అన్నారు. అనటమే తప్ప జరిగిన దాఖలాలు కూడా లేవు.



Next Story

Most Viewed