మద్యానికి బానిసై.. వ్యక్తి ఆత్మహత్య

by Disha Web Desk 11 |
మద్యానికి బానిసై.. వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నిజాంసాగర్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి, సంపాదన మొత్తం మద్యం తాగటానికే ఖర్చు చేయడంతో కుటుంబ పోషణ భారమై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నిజాంసాగర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కొమ్మలంచ గ్రామానికి చెందిన జ్యోతు లక్ష్మణ్(37), గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. సంపాదించిన డబ్బు మొత్తం మద్యం తాగటానికే ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ భారమైంది. దీంతో లక్ష్మణ్ జీవితంపై విరక్తి చెందాడు. భార్య పద్మను ఇద్దరు పిల్లలను గాంధారి మండలం బస్వాపూర్ గ్రామానికి పుట్టింటికి పంపి, తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ ఎస్సై రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed