డ్రైవర్లు భయపడటం వల్లే ప్రమాదాలు..

by Disha Web Desk 20 |
డ్రైవర్లు భయపడటం వల్లే ప్రమాదాలు..
X

దిశ, భిక్కనూరు : ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో, సిబ్బంది విజిల్ కొట్టడం, వాహన డ్రైవర్లు భయపడిపోయి ముందు వెనక చూడకుండా స్పీడ్ పెంచడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం భిక్కనూరు "దిశ "తో ఫోన్ లో మాట్లాడుతూ రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన బొల్లారపు లింగారెడ్డి ఈరోజు ప్రమాదంలో మృతి చెందడానికి లారీ డ్రైవర్ భయపడిపోయి, స్పీడ్ పెంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు పూర్తి బాధ్యత ఆర్టీఏ అధికారులు వహించాలని డిమాండ్ చేశారు.

తాను కూడా మూడుసార్లు ఇదే విధమైన ప్రమాదాల నుంచి బయటపడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎక్కడా జరగని ప్రమాదాలు ఆ ప్రాంతంలో జరగడానికి చెక్ పోస్ట్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద పెద్ద ఎత్తున రోడ్డు విస్తరణ చేపట్టినప్పటికీ కొన్ని వాహనాలు చెక్ పోస్ట్ ను గమనించకుండా ముందుకు వెళుతుండడం, సిబ్బంది విజిల్ కొడుతుండడంతో ఏమైందో నన్న భయంతో వాహన డ్రైవర్లు వేగాన్ని పెంచడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నా రు. ఇకనైనా ఆర్టీఏ అధికారులు ప్రమాదాలు జరగకుండా, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


Next Story

Most Viewed