- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా పాలనకు ఏడాది : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
దిశ,దర్పల్లి: పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా పాలనకు ఏడాది గడచిందని కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో శనివారం పాత గురుడి కాపు సంఘంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 4.50 కోట్లు అందించామని తెలిపారు. గడీల పాలనకు స్వస్తి పలికి, ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసినట్లు, రైతుల ధాన్యానికి క్వింటాలుకు సన్నాలకు బోనస్ 500 అందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రాబోయే కాలంలో 3500 మందికి ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. పదేళ్ల కాలంలో జరగని అభివృద్ధి ఏడాదిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గృహలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు, 500 లకే గ్యాస్ సిలిండర్ వంటివి అందించి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగిత అవకాశాలు సుమారు 60 వేల ఉద్యోగాలు అందించామని తెలిపారు. గ్రూప్ 1,2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని కళ్ళు లేని కబోధిని లాగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని బీజేపీని భారతీయ జూటా పార్టీగా ఎమ్మెల్యే అభిమానించారు.
తెలంగాణ, ఆంధ్ర రీ ఆర్గనైజేషన్ బిల్లు పాసై 11 ఏళ్లు గడిచినా ఇంతవరకు అమలు చేయలేదని దీనిపై పోరాడకుండా తెలంగాణ ఎంపీలు మోడీకి గులాంగిరి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కేసీఆర్ రాష్ట్రంను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడని వాటన్నింటిని అధిగమించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు, ఎంపీడీవో బాలకృష్ణ, తహసీల్దారు మాలతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదరి మనోహర్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి , చెలిమెల నర్సయ్య, శ్రీనివాస్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎబ్ నైజర్ సింగిల్ విండో అధ్యక్షుడు చిన్నారెడ్డి (ధర్పల్లి), జనార్దన్ రెడ్డి (ఓన్నాజీపేట్), అబ్దుల్ హమీద్, కుమ్మరి గుండయ్య తదితరులు పాల్గొన్నారు.