సర్వం కోల్పోయాం.. మా కుటుంబాన్ని ఆదుకోండి సారూ..

by Disha Web Desk 20 |
సర్వం కోల్పోయాం.. మా కుటుంబాన్ని ఆదుకోండి సారూ..
X

దిశ, నిజామాబాద్ సిటీ : తన కొడుకు మృతి చెంది దాదాపు రెండు మాసాలు పూర్తవుతుందని, ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు గాని, ఆర్థికంగా ఎవ్వరూ ఆదుకోలేదని సఫియాబేగం అన్నారు. శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో విద్యార్థితల్లి మాట్లాడుతూ.. మైనార్టీ గురుకుల పాఠశాలలో అనుమానస్పదంగా విద్యార్థి తన కొడుకు షేక్ సోఫియాన్ మృతి చెందాడని మైనార్టీ గురుకుల పాఠశాల సంబంధిత అధికారులు మీడియా సమక్షంలో సూచించిన విషయం తెలిసిందని ఆమె అన్నారు.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్దిపూర్ శివారులోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణలో తన కొడుకు మృతి చెంది ఇప్పటివరకు దాదాపు రెండు మాసాలు పూర్తికావాల్సి వస్తుందని, మైనార్టీ గురుకుల పాఠశాలలో జరిగిన ఘర్షణ ఏ విధంగా జరిగిందో తమకు ఇప్పటివరకు అనుమానాస్పదంగానే ఉందని అన్నారు. తన కొడుకు పుట్టిన ఐదు సంవత్సరాలకే తన భర్త అనారోగ్య కారణాలవల్ల మృతి చెందాడని, ఎంతో కష్టపడి తన కొడుకును ఉన్నత చదువులు చదివించాలని ఉద్దేశంతో మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించారన్నారు. మా కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడన్న ధీమాతో ఉన్నమాకు విద్యార్థుల ఘర్షణ తమ కుటుంబాన్ని చీకటిగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్త లేడని చీకటి బతుకులో బ్రతుకుతున్న తనకు ఒక వెలుగును నింపే కొడుకు ఉన్నాడని ఎంతో ధైర్యంగా ఉంటే గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ చివరికి అంధకారంలోకి తమ జీవితంలో నెట్టేసిందని అన్నారు. ఇప్పటికైనా సర్వం కోల్పోయి చీకటి బతుకుల బతుకుతున్నా తమ కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పించాలని విన్నవించుకుంటున్నామని, తమ కుటుంబానికి సహాయ సహకారాలు గాని ఆర్థికంగా ఆదుకునేందుకు తమకు ఎవరు లేరని ఆమె అన్నారు. తమ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గాని, నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గాని, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నైనా ఆదుకోవాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామన్నారు.


Next Story