పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని…కమిషనర్ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

by Kalyani |
పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని…కమిషనర్ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఓ మహిళా ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం జరిగింది. మాక్లూర్ మండలం దాస్ నగర్ కు చెందిన నర్సమ్మ తన స్థలాన్ని కొందరు కాంగ్రెస్ నేతల అండతో కబ్జాకు పాల్పడుతున్నారని మున్సిపల్ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసింది. ఆ స్థలంలో జరుగుతున్న ఇంటి నిర్మాణ పనులను ఆపేయించారు. కానీ కాంగ్రెస్ నేతల అండతో పనులు యథావిధిగా సాగిస్తున్నాడు. దీంతో మాక్లూర్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మాక్లూర్ ఎస్సై నిర్మాణం వివాదం పరిష్కరించుకోవాలని లేదంటే చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పారు. కానీ కాంగ్రెస్ నాయకుల అండతో పనులు అలాగే కొనసాగించారు. నరసమ్మ మంగళవారం నేరుగా నిజామాబాద్ వచ్చి కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో అక్కడి సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బయటపడకుండా పోలీసులు నరసమ్మ ఎక్కడ చికిత్స పొందుతుందో బహిర్గతం కానివ్వలేదు.

Next Story

Most Viewed