ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

by Naveena |
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
X

దిశ,బాన్సువాడ : కామారెడ్డి జిల్లా నసూరుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో..భర్త టేకుల మైసయ్యను ప్రియుడితో కలిసి భార్య రాధాబాయి హత్య చేసింది. మద్యం తాగించి కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని దుర్కి గ్రామంలోని సోమలింగేశ్వర ఆలయం కోనేరులో మూట కట్టి పడేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడికి బాబు కార్తీక్,అమ్మాయి లావణ్య ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నసృ ల్లాబాద్ పోలిసులు తెలిపారు.

Advertisement

Next Story