- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రైల్వేస్టేషన్ నుంచి ఓ వ్యక్తి అదృశ్యం
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పోతంగల్ గ్రామానికి చెందిన సయ్యద్ మౌలానా (53) అనే వ్యక్తి ఆయన భార్యతో కలిసి నెల్లూరు నుంచి నిజామాబాద్ కు కృష్ణ ఎక్స్ ప్రెస్ లో నిజామాబాద్ కు వచ్చారు. రైలు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో స్టేషన్ కు చేరుకోవడంతో..రైల్వే స్టేషన్ లోనే నిద్రించారు. మౌలానాకు మానసిక స్థితి సరిగ్గా లేదు. దీంతో మౌలానా తనతో పాటు రైల్వే స్టేషన్ లో ఉన్న భార్యకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. మౌలానా భార్యకు మెలుకువ వచ్చిన తరువాత భర్త కోసం చుట్టు ప్రక్కల ఎక్కడ వెతికినా మౌలానా అచూకీ కనిపించలేదు. ఈ విషయం వెంటనే తన కుమారుడికి తెలిపింది. దీంతో మౌలానా కొడుకు నిజామాబాద్ కు చేరుకుని తన తండ్రి అదృశ్యంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మౌలానాను వెతికేందుకు రెండు టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదృశ్యమైన మౌలానా ఎక్కడైనా కనిపిస్తే నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి సెల్ నెంబర్ 8712658591 కు ఫోన్ చేసి తెలపాలని పోలీసులు కోరారు.