చేప కనిపించింది..పట్టుకుందాం అనుకునే లోపే..

by Naveena |
చేప కనిపించింది..పట్టుకుందాం అనుకునే లోపే..
X

దిశ ,నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.స్థానికులు, ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్ (40) అనే వ్యక్తి మిషన్ భగీరథ లో అవుట్ సైడ్ కింద విధులు నిర్వహిస్తుంటాడు. కాగా మహమ్మద్ నగర్ సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో చేప కనపడటంతో.. పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులోనే పడిపోయాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతయ్యాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి నీటి పారుదలశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో..ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. అనంతరం కర్రె విఠల్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు

Next Story

Most Viewed