- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బతుకమ్మ, దసరా పండుగలకు 482 ప్రత్యేక బస్సులు
దిశ, నిజామాబాద్ : బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్.టి.సి. నిజామాబాద్ రీజినల్ మేనేజర్ తెలిపారు. ప్రతి రోజు నిజామాబాద్ నుంచి జెబిఎస్ వరకు, జెబిఎస్ నుంచి నిజామాబాద్ వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలపారు. పండుగల రద్దీ కారణంగా..మంగళవారం నుంచే అదనపు బస్సులను ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ నెల 1 నుంచి 15 వరకు ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు అదనంగా మరో 482 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. రీజియన్ లోని ఆరు డిపోల నుంచి జెబిఎస్ వరకు నడుపుతున్నట్లు తెలిపారు. ఇతర ప్రధాన రూట్లలో కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtcoline.in అనే వెబ్ సైట్ లో సీటు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. బస్సుల వివరాల కోసం డిపోల వారిగా పేర్కొన్న..సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఆర్మూర్ 738284313, బోధన్ 9849500725, నిజామాబాద్ 9959226022,బాన్సువాడ - 9491105706, కామారెడ్డి - 8468220281 ఆయా డిపోల వారీగా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని ఆర్ ఎం సూచించారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం చేయాలని ఆయన కోరారు.