- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
400 గ్రాముల గంజాయి పట్టివేత

దిశ, ఏర్గట్ల : మండల కేంద్రంలోని శివాలయం శివారులో మంగళవారం పోలీసులు 400 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. గంజాయి అమ్ముతున్నట్టు పక్కా సమాచారం అందడంతో ఎస్సై రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొన్నారు. అంతలోనే ఇద్దరు నిందితులు అప్రమత్తమై పారిపోవడానికి ప్రయత్నించగా చాక చక్యంతో వారిని పట్టుకొని విచారించారు. వారి వద్ద 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మెట్పల్లి మండలం రంగారావు పేట్ గ్రామానికి చెందిన గోరె శ్రావణ్ (21), జూవేనిల్ (మైనర్ బాలుడు) లుగా గుర్తించారు. వీరు మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామం నుండి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ భింగి జనార్ధన్ కి సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఎస్ఐ రాజు, కానిస్టేబుల్ రాజశేఖర్, విజయ్, గంగాధర్, సురేష్ లను సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు.