నిర్మల్: అసమ్మతి నేతలతో మంత్రి సమావేశం.. చర్చలు సఫలం

by Disha Web |
నిర్మల్: అసమ్మతి నేతలతో మంత్రి సమావేశం.. చర్చలు సఫలం
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. మున్సిపల్ చైర్మన్ గండ్రత్‌ ఈశ్వర్‌పై పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన మంత్రి ఇంద్రకరణ్ హుటాహుటిన నిర్మల్ చేరుకున్నారు. తాజాగా మంత్రి నివాసంలో ఖానాపూర్, నన్పూర్ అసమ్మతి కౌన్సిలర్లతో సమావేశం అయ్యారు. ఎవరినీ తక్కువ చేయకుండా అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో అసమ్మతిపై కౌన్సిలర్లు వెనక్కి తగ్గారు. మంత్రి ఆదేశాలతో నిర్మల్‌లో క్యాంప్‌ పాలిటిక్స్‌ ముగిశాయి.

Also Read...

రెండేళ్ల గ్యాప్ తర్వాత అసెంబ్లీకి గవర్నర్.. స్పీచ్‌పై ఉత్కంఠ!
Next Story