తెలంగాణ మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు

by Satheesh |
తెలంగాణ మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త వాహనాలు అందించింది. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం 22 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. అయితే, తెలంగాణలో అనూహ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ కొత్త వాహనాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాత కాన్వాయ్‌నే ఉపయోగిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్ కార్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దించింది. అనంతరం ఆ వాహనాలను మంత్రులకు కేటాయించింది. మంత్రులకు ల్యాండ్ క్రూయిజర్ వాహనాల కేటాయింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పక్కా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెబుతోన్న కాంగ్రెస్ సర్కార్.. మంత్రులకు రిచ్‌గా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఇవ్వడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed