నూతన బతుకమ్మ సాంగ్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత..

by Disha Web Desk 19 |
నూతన బతుకమ్మ సాంగ్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత..
X

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ ఆడపడుచుల పండుగ అని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని "సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో" అనే ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పండుగను విశ్వవ్యాప్తం చేశామన్నారు. పాటను రూపొందించిన జేన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హోం మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమి చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ మూజీబ్, హాజ్ కమిటీ చైర్మన్ సలీం, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed