బతుకమ్మ సంబురాలు.. టాలీవుడ్‌పై నెటిజన్ల ఆగ్రహం

by Disha Web Desk 4 |
బతుకమ్మ సంబురాలు.. టాలీవుడ్‌పై నెటిజన్ల ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ సంబరాల చివరి ఘట్టం సద్దుల బతుకమ్మకు వేళ అయింది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు ఇవాళ సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సీఎం కేసీఆర్ తో పాటు ప్రతిపక్ష నేతలైన బండి సంజయ్, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో చాలా ప్రత్యేకమైన బతుకమ్మ పండగకు టాలీవుడ్ ప్రముఖుల నుండి ఎలాంటి విషెష్ రాకపోడవంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతి చిన్న విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే తెలుగు నటీనటులు తెలంగాణ మహిళలకు ఎంతో ప్రాముఖ్యమైన బతుకమ్మ పండగకు కనీసం శుభాకాంక్షలు చెప్పలేరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 'తెలంగాణ మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలుగు మూవీ స్టార్స్ ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్ లో ఉంటూ స్థానిక సంస్కృతిని విస్మరించిన వారు సిగ్గుపడాలంటూ' నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరైతే బతుకమ్మ పండగకు బదులు సంక్రాంతి అయి ఉంటే టాలీవుడ్ అంతా శుభాకాంక్షలు చెప్పేదని, ఇది తెలంగాణ ప్రాంత పండగల పట్ల టాలీవుడ్ నటులకు ఉన్న వివక్ష అంటూ చర్చించుకుంటున్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed