- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
నిర్లక్ష్యంగా నర్సింగ్ కౌన్సిల్.. ఆందోళనలో అభ్యర్థులు

దిశ, తెలంగాణ బ్యూరో: నర్సులను సర్టిఫికేట్రెన్యువల్ కష్టాలు వేధిస్తున్నాయి. నర్సింగ్ కోర్సు పూర్తి చేసినోళ్లు మొదటి రిజిస్ట్రేషన్తర్వాత ప్రతి ఐదేళ్లకోసారి నర్సింగ్ కౌన్సిల్‌లో రెన్యువల్చేసుకోవాలనేది రూల్. ప్రభుత్వ ఉద్యోగాల్లో రెన్యువల్ ఉంటేనే అర్హత ఉన్నట్లు పరిగణిస్తారు. దీంతో వారం రోజుల నుంచి టీఎస్ఎన్సీకి రెన్యువల్ కోసం సుమారు నాలుగు వేల అప్లికేషన్లు రాగా అవన్నీ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. స్టాఫ్తక్కువగా ఉండటం, ఆఫీసర్ల మానిటరింగ్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు కొత్త కొలువుల గడువు ముగింపు సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. ఈ అప్డేటెడ్సర్టిఫికేట్ ఉంటేనే కొత్త పోస్టులకు అప్లై చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులను ప్రాధేయపడినా సమస్య పరిష్కారం కావడం లేదని నర్సులు చెబుతున్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవ చూపాలని నర్సులు కోరుతున్నారు.
నోటిఫికేషన్లు లేకపోవడంతో జాప్యం:
స్వరాష్ట్రంలో ఏళ్లుగా నర్సింగ్ నోటిఫికేషన్లు లేకపోవడంతో చాలామంది గడువు ముగిసినా, రెన్యువల్స్చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు కౌన్సిల్ కూడా గడువు ముగిసినట్లు అలెర్ట్పంపడం కానీ, తనిఖీలు చేయడం వంటివి చేయలేదు. దీంతో కొంతమంది నర్సులు రెన్యువల్ విషయాన్ని మరిచిపోయారు. ఇటీవల మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులంతా తమ సర్టిఫికేట్స్‌ను రెన్యువల్ చేయించుకొని ఉండాలి. దీంతో చాలా మంది నర్సులు కౌన్సిల్‌కు క్యూ కడుతున్నారు.
ఆన్‌లైన్‌పై అవగాహన లేక..
వాస్తవానికి ఆన్‌లైన్‌లో కూడా రెన్యువల్స్చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ, వీటిపై అవగాహన లేక చాలామంది నర్సులు కౌన్సిల్‌కు నేరుగా వెళ్తున్నారు. వివిధ జిల్లాల నుంచి సైతం వేల సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఒక్కసారి కౌన్సిల్సిబ్బందిపై పని భారం పెరిగింది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల తర్వాత రావాలని సూచిస్తున్నారు. ఇది అభ్యర్థుల ఆందోళనకు కారణమైంది. రెగ్యులర్ నోటిఫికేషన్అప్లై గడువు కేవలం మరో పది రోజులే ఉండటంతో సకాలంలో రెన్యువల్ అవుతుందా? లేదా? అనే అనుమానంతో నర్సులు ఆందోళన చెందుతున్నారు. కాగా కౌన్సిల్‌కు వచ్చిన మహిళలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి నీళ్లు లేవని, వాష్ రూమ్స్ సైతం లేక అవస్థలు పడుతున్నట్టు చెబుతున్నారు.