నన్నెందుకురా మోసం చేశావ్..?

by Sumithra |
నన్నెందుకురా మోసం చేశావ్..?
X

దిశ, నల్లగొండ క్రైం : తనతో సహజీవనం చేసి, మరో యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడని మనస్తాపంతో ఓ యువతి తనువు చాలించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా, బాధితురాలి స్వగ్రామంలోని కోదాడ - జడ్చర్ల హైవే పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతల పహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి (27) హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తోంది. అదే గ్రామానికి చెందిన కుక్కల జాన్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది.

ఇద్దరు కలిసి కొన్నేండ్లుగా సహజీవనం చేశారని బాధితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన నల్లగొండకు ఆనుకుని ఉన్న ఓ గ్రామానికి చెందిన మరో యువతిని మార్చి10న చెరువుగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మల్లీశ్వరి తీవ్రమైన మనస్తాపానికి గురౌతూ వస్తోంది. దీంతో తాను ఉంటున్న హాస్టల్ బాత్ రూంలోకి వెళ్లి విషం తాగింది. వెంటనే, అక్కడున్న వారు గమనించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి మల్లీశ్వరి మృతదేహాన్ని బొక్కమంతల పహాడ్ తీసుకొచ్చి, నిందితుడు జాన్ రెడ్డి ఇంటి ఎదుట ఉంచి ధర్నా చేశారు. హుటాహుటిన స్థానిక ఎస్ఐ ఉప్పు సురేష్ అక్కడికి చేరకుని, బాధితులతో మాట్లాడి నచ్చజెప్పారు.

హైవే పై టెంట్ వేసి.. భారీ ట్రాఫిక్ జాం..

చనిపోయిన యువతి స్వగ్రామం బొక్కమంతల పహాడ్ గ్రామంలో మంగళవారం ఉదయం నుంచే రోడ్డు పై టెంట్ వేసి, మృతదేహంతో ఆందోళన చేపట్టారు. జడ్చర్ల - కోదాడ హైవే పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. ఎస్సై సురేష్, ఏఎస్ఐ జోజీ ఆధ్వర్యంలో బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా బాధితులు వినలేదు. నిందితులను రిమాండ్ కు తరలిస్తేనే, ఆందోళన విరమిస్తామని చెప్పడంతో, ఎస్ఐ సురేష్ ఉన్నతాధికారులకు ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంతో, అప్పటికే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు కుక్కల జాన్ రెడ్డిని నల్గొండ ఎస్పీ ఆఫీస్ కు తీసుకొస్తున్నారు.

Next Story

Most Viewed