- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.. ఎస్పీ కె.నరసింహ

దిశ, ఆత్మకూరు ఎస్ : పోలీసుల ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం కేంద్రంలో గల ప్రభుత్వ SC హాస్టల్ లో 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులకు పలు అంశాల మీద అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు పరుపులు, బెడ్ షీట్స్, బకెట్స్, పరీక్ష సామాగ్రి అందించారు. మంచి ఆలోచనలతో ఉత్తమ పౌరులుగా ఉంటాం అని విద్యార్థులతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు అందరికీ జిల్లా పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివా, నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ సహాయసహకారాలు అందించారన్నారు. మంచి మనసు మంచి మార్గంలో నడిపిస్తుంది, చెడు ఆలోచన చెడు వైపు నడిపిస్తుంది అన్నారు. వత్తిడికి గురవకుండా విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని అన్నారు. గడిచిన సమయం తిరిగిరాదు, సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని మంచి చేయడానికి, జ్ఞానాన్ని సాధించడానికి వినియోగించాలన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వసతులు, అవకాశాలు బాగా పెరిగాయని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మార్గం మధ్యలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఇలాంటి వాటిని ఎదుర్కొని నిలబడాలన్నారు. లక్ష్యాలు పెట్టుకుని ఉన్నతమైన మార్గంలో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్థానిక MRO హరి కిషోర్ వర్మ, హాస్టల్ వార్డెన్ రవి, ఉపాద్యాయులు, విద్యార్థులు పోలీసు సిబ్బంది అన్నారు.