ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్లే అధికం

by Naveena |
ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్లే  అధికం
X

దిశ,తుంగతుర్తి: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఒక లక్ష 52 వేల 959 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇందులో 76 వేల 256 మంది పురుషులు ఉండగా..76 వేల 699 మంది మహిళలు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 443 అధికంగా ఉంది. తుంగతుర్తి,తిరుమలగిరి మండలాలను మినహాయిస్తే..మిగతా నాలుగు మండలాల్లో మహిళలే అధికంగా ఉన్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలో 11,900 మంది పురుషులు,12,118 మంది మహిళలు ఉన్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలో మొత్తంగా 24,018 ఓటర్లు ఉన్నారు. అలాగే మద్దిరాలలో పురుషులు12,428, మహిళలు 12,565,ఇతరులు ఒకరు చొప్పున మొత్తంగా 24,994 ఉండగా.. నాగారంలో పురుషులు 11,943,మహిళలు 12,162 ఇతరులు 3 మంది చొప్పున మొత్తంగా 24,10 ఉన్నారు. అలాగే నూతనకల్ లో పురుషులు 14,216 మంది, మహిళలు 14,228 మంది, మొత్తంగా 28,439 ఉన్నారు. ఇక తిరుమలగిరిలో పురుషులు 8,812 మంది,మహిళలు 8,763 మంది మొత్తంగా 17,575 ఉండగా..తుంగతుర్తిలో పురుషులు 16,957 మంది ,మహిళలు 16,868 మంది, మొత్తంగా 33,825 ఓటర్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed