పతి కోసం సతీమణి ఎన్నికల ప్రచారం

by Naresh N |
పతి కోసం సతీమణి ఎన్నికల ప్రచారం
X

దిశ, మర్రిగూడ: మండలంలోని పలు గ్రామాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిరాజ్ గోపాల్ రెడ్డి మండలంలోని తిరంగండ్లపల్లి, ఎరుగండ్లపల్లి, తమ్మడపల్లి, నరసింహపురం, అజిలాపురం, తూర్పు తండా , కొండూరు , బట్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన లక్ష్మీ రాజ్ గోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఇచ్చిన పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టిన గొప్ప మనిషి రాజగోపాల్ రెడ్డి అని,తన రాజీనామాతో ప్రభుత్వ యంత్రాంగం 119 మంది ఎమ్మెల్యేలు వచ్చి మీ కాళ్ళ దగ్గర మోకరిల్లారని గుర్తు చేశారు. తన సొంత డబ్బుతో పేద ప్రజలకు సహాయం చేసే అంత గొప్పగా ఉన్న మనిషిని వదులుకోవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పై ఓటేసి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story