' త్వరలో 100 పడకల ఆసుపత్రిని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం '

by Sumithra |
 త్వరలో 100 పడకల ఆసుపత్రిని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం
X

దిశ, నకిరేకల్ : ఈ నెల చివరి నాటికి ఆసుపత్రి పనులు పూర్తిచేసి త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. బుధవారం పట్టణంలో నిర్మిస్తున్న 100 ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 100 పడకల ఆస్పత్రి పనులు 95% పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఐదు ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉంటాయన్నారు. పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పెండింగ్ లో ఉన్న పనులకు పలుసూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత, శ్రీనివాస్, కౌన్సిలర్ లు గాజుల సుకన్య, ఘర్షకోటి సైదులు, రాచకొండ సునీల్, చౌగొని సైదులు, కాంగ్రెస్ నాయకులు సకిరాల రవి, లింగాల వెంకన్న, మంగలపల్లి రాజు, ఎల్లపు రెడ్డి యాదగిరి రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed