- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మా ఊరిలో మద్యం అమ్మనివ్వం

దిశ,భూదాన్ పోచంపల్లి : గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బెల్టు షాపులు సమయపాలన లేకుండా తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. దీంతో బెల్టు నిర్వాహకులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్యంతో పాటు అర్డికంగా నష్టపోతున్నారు. ఈ మేరకు ఆదివారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తులు కుల, మత, పార్టీలకతీతంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ఎలాంటి బెల్ట్ షాపులు ఉండకూడదని తీర్మానించారు.
అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీర్మానాన్ని వ్యతిరేకించి మద్యం విక్రయిస్తే రూ.25 వేల జరిమానా, సమాచారం అందించిన వారికి 5000 బహుమతిని అందించనున్నామని పేర్కొన్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులను ఇంద్రియాల గ్రామస్తులు నిషేధించడంతో పలు గ్రామాల ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగలిపాక యాదగిరి, ఉడతల సాయిరాం, గరిసే జంగయ్య ,చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.