వార్డ్ మెంబర్ వేధింపులు తట్టుకోలేక గ్రామపంచాయతీ వర్కర్ ఆత్మహత్య యత్నం

by Disha Web Desk 23 |
వార్డ్ మెంబర్ వేధింపులు తట్టుకోలేక గ్రామపంచాయతీ వర్కర్ ఆత్మహత్య యత్నం
X

దిశ,చండూరు: వార్డ్ మెంబర్ వేధింపులు తట్టుకోలేక గ్రామపంచాయతీ వర్కర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కస్తాల గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకరం బొమ్మరబోయిన పుష్పలత 2016 నుండి గ్రామపంచాయతీ వర్కర్ గా పనిచేస్తుంది.అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు జోగు వెంకన్న తన విధులకు ఆటంకం కలిగిస్తూ, తనను వెంబడిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు.ఈ రోజు గ్రామ పంచాయతీ పాలక వర్గ సమావేశంలో కూడా మళ్లీ తనను దుర్భాష లాడడంతో మనోవేదనకు గురై గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆమె ఆత్మహత్య యత్నం చేసిందన్నారు. ఆ వార్డు సభ్యునిపై తగు విచారణ జరిపి వార్డ్ మెంబర్ కు అనర్హుడుగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో, ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.


Next Story

Most Viewed