ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ... జాతీయ రహదారిపై కూలి పనులు చేస్తున్న ఇద్దరు మృతి

by Dishanational1 |
ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ... జాతీయ రహదారిపై కూలి పనులు చేస్తున్న ఇద్దరు మృతి
X

దిశ, మునగాల: ట్రాక్టర్ ను లారీ ఢీకొనడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన 14 మంది దినసరి కూలీలు జీఎంఆర్ సంస్థలో కూలి పనికి వచ్చి ఆకుపాముల గ్రామ శివారులోని 65 నెంబర్ జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను కొట్టి కొన్లు పెట్టుకుని డివైడర్ ప్రక్కన ఉన్న ట్రాక్టర్ లో వేస్తుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ అతివేగంగా వచ్చి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో నేలమర్రి వినోద(23) అక్కడికక్కడే మృతి చెందగా, తుమ్మల ధనమ్మ(55), చెవుల రోషమ్మ, డ్రైవర్ దాసు లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధనమ్మ మృతి చెందగా రోశమ్మ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిపారు.

జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్ లారీని రెండు క్రేన్ల సహాయంతో పోలీసులు పక్కకు తొలగించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా వాహనం నడిపి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైన లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రయాణ సమయంలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాద నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రమాదాలుజరుగుతున్నాయని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, మునగాల ఎస్ఐ లోకేష్, సిబ్బంది ఉన్నారు.


Next Story

Most Viewed