బుద్ధవనంలో బయల్పడిన పాత రాతియుగపు ఆనవాళ్లు

by Disha Web Desk 7 |
బుద్ధవనంలో బయల్పడిన పాత రాతియుగపు ఆనవాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బుద్ధవనంలోని బౌద్ధ పర్యాటక వారసత్వ థీమ్ పార్క్‌లో పాతరాతి యుగపు ఆనవాళ్లు బయల్పడినాయి. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో కృష్ణాతీరం వెంట, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయడానికి, సర్వే నిర్వహిస్తుండగా, పురావస్తు పరిశోధకుడు, బుద్దవనం బౌద్దవిషయ నివుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వీటిని గుర్తించారు. నదిలో దొర్లిన బింగిరాయిని, పాతరాతియుగపు ఆదిమ మానవుడు ఆ రాయికి పొనలో హెచ్చులు తీసి, పనిముట్లుగా తయారు చేసుకున్నాడని శివనాగిరెడ్డి చెప్పారు.

పాతరాతియుగంలో పనిముట్లు, తయారీలో నైపుణ్యాన్ని సంతరించుకున్న దశ (క్రీ.పూ. 2-6- 1-6 మిలియన్ సంవత్సరాలు)కు చెందిందని, ఇలాంటి పనిముట్లను అచూలియన్ తరగతికి చెందినవిగా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటారని ఆయన తెలిపారు. గతంలోనూ కొత్త రాతియుగం ఆనవాళ్లను గుర్తించిన బుద్ధవనంలో తాజాగా, పాతరాతియుగం పనిముట్లు బయటపడటంతో బుద్ధవనం చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరుణో బుద్ధబిక్షువు, అధికారులు సుధన్ రెడ్డి, శ్యాం సుందర్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి చెప్పారు.


Next Story

Most Viewed