ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నేడు మూడు నామినేషన్లు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

by Aamani |
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నేడు మూడు నామినేషన్లు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
X

దిశ,నల్లగొండ : వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు వారి నామినేషన్లను దాఖలు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం నామినేషన్లు వేసిన వారిలో ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని, స్వతంత్ర అభ్యర్థులుగా అర్వ స్వాతి, చాలిక చంద్రశేఖర్లు చెరో సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కలెక్టర్ తో పాటు ఉన్నారు.

Advertisement
Next Story