దిశ రిపోర్టర్‌కు ‌ బెదిరింపు కాల్స్

by Disha Web Desk 22 |
దిశ రిపోర్టర్‌కు ‌ బెదిరింపు కాల్స్
X

దిశ, నాగారం: నాగారం మండలం వర్ధమానుకోట శివారు నరసింహుల గూడెం చెరువులో కాలీ చేస్తున్నటువంటి నీటిని గురించి వచ్చినటువంటి వార్త ''అన్నం పెట్టే రైతన్నకు కన్నం కొడుతున్న చేపల గుత్తేదారు" అనే శీర్షిక దిశ దినపత్రికలో ఆదివారం ప్రచురితం కాగా గుత్తేదారు వివిధ ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. డీఈని వివరణ కోరగా మీరేమైనా ప్రత్యక్షంగా చూసారా ? అని పాత్రికేయులకే తిరిగి ప్రశ్నలు వేస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చడానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గుత్తేదారులు తప్పు చేయడమే కాకుండా చేసిన తప్పును గ్రామస్తులపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారి కూడా పాత్రికేయులకు తిరిగి ప్రశ్న వేయడంతో అధికారి కూడా గుత్తేదారుడుతో చేతులు కలిపాడని… అనుమానం వ్యక్తం అవుతుంది. చెరువు నింపాలన్న గుత్తేదారే కాలీ చేయాలన్న గుత్తేదారే అంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తుంది. ఇలా చేసిన తప్పును గ్రామస్థుల పై నెట్టాలని చేసేవారిపై అందుకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.


Next Story

Most Viewed