10 జీపీఏ సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తా.. కలెక్టర్

by Sumithra |
10 జీపీఏ సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తా.. కలెక్టర్
X

దిశ, కనగల్లు : కేజీబీవీ విద్యార్థులు పదో తరగతిలో 10 జీపీఏ మార్పులు సాధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలను రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించి భోజనం చేశారు. వారితో సెల్ఫీ దిగారు. పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకెళ్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఎంపీఓ వసుమలత, పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.

Advertisement
Next Story