Suryapet: ఆ పార్టీలకు అభ్యర్థులే లేరు: మంత్రి జగదీశ్ రెడ్డి

by srinivas |
Suryapet: ఆ పార్టీలకు అభ్యర్థులే లేరు: మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు నేతలే లేరని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లిస్టు ప్రకటనతో ప్రతిపక్ష పార్టీల్లో నిద్ర పట్టడంలేదన్నారు. సీఎం కేసీఆర్ దెబ్బకు వాళ్లకు ఏం చేయాలో తోచడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు పోటీనే లేదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శరణ్యమని జగదీశ్ రెడ్డి తెలిపారు. 77 ఏళ్లు దేశాన్ని రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేశాయన్నారు. తెలంగాణలో బీజేపీకి ఉన్న మూడు ఎమ్మెల్యే స్థానాలు నిలబెట్టుకోవడానికి అపసోపాలు పడుతోందని విమర్శించారు. నల్గొండ జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించి సీఎం కేసీఆర్ చేతిలో పెడతామని చెప్పారు. మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed