- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
దిశ, కోదాడ: అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.... కోదాడ రోడ్డు పరిధిలో ఇసుక అక్రమ రవాణా, గంజాయి రవాణా, పీడీఎస్ అక్రమ రవాణాపై, పేకాట పై నిఘా ఉంచామని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద సైతం ఎప్పటికప్పుడు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. యువత గంజాయికి అలవాటు పడకుండా పూర్తిస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. పూర్తిస్థాయిలో పోలీసులు అందుబాటులో ఉంటారని ఎవరైనా అక్రమంగా రవాణాకు పాల్పడినట్లు సమాచారం ఉంటే తప్పనిసరిగా SI కోదాడ రూరల్ CI కోదాడ రూరల్, 8712686010, SI కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ 8712686043 ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.