గుండాలలో కలకలం.. భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

by Disha web |
గుండాలలో కలకలం.. భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత
X

దిశ, గుండాల: గుండాల మండలంలోని మరిపడగా గ్రామ శివారులో భారీగా పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీగా పేలుడు పదార్థాలు జిలేటిన్ స్టిక్స్, డిటోనేటర్స్, కనెక్టింగ్ వైర్లు వాటికి సంబంధించిన వస్తువులను తరలిస్తున్న ఆటోను, ఒక బైక్ ను, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

ముఠా సభ్యులను నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కీలకమైన ఆపరేషన్ రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్, జాయింట్ సీపీ సత్యనారాయణ, రాజేష్ చెంద్ర డీసీపీ యాదాద్రి జోన్, ఈ ఆపరేషన్ ఇంచార్జి సీఐ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో గుండాల సబ్ ఇన్ స్పెక్టర్ డి. యాకన్న సిబ్బందితో వారిని పట్టుకున్నారు అని తెలిపారు. అదుపులో ఉన్న వ్యక్తులు దున్నపోతుల యాదయ్య హన్మకొండ జిల్లా, శివరాత్రి యాదగిరి యాదాద్రి జిల్లా, వనం కనకరాజు యాదాద్రి జిల్లా, గోసంగి ఎషోబు జనగామ జిల్లా వాసులుగా గుర్తించి వారిపై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఒక వ్యక్తి వీరారెడ్డి కరీంనగర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Next Story