ప్రాథమిక సహకార సంఘం‌లో చోరి

by Dishaweb |
ప్రాథమిక సహకార సంఘం‌లో చోరి
X

దిశ, గరిడేపల్లి: ప్రాథమిక సహకార సంఘంలో 7లక్షల 83వేల రూపాయల దోపిడీ జరిగిన శనివారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గరిడేపల్లి ఎస్ ఐ పి.వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారి గూడెం గ్రామ పరిధిలో ఉన్న రాయినిగుడెం ప్రాథమిక సహకార సంఘం లో శనివారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంక్ వెనుక ఉన్న కిటికీ చువ్వలను తెరిచి, బ్యాంక్ లో కి ప్రవేశించి క్యాషియర్ తన డ్రా లో పెట్టిన డబ్బులను దొంగిలించినారు. ఈ విషయము సహకార సంఘం సెక్రెటరీ తెలపగా నేరేడుచర్ల ఎన్ డి సి సి బి మేనేజర్ వచ్చి బ్యాంక్ కు వెళ్ళి బ్యాంక్ లో గల కాయిన్ బుక్ ను పరిశీలించగా బ్యాంక్ నందు 7,83000/- రూపాయలు దొంగతనం జరిగినట్లుగా గుర్తించినారు. నల్గొండ జిల్లా కొ ఆపరేటివ్ బ్యాంక్ నేరేడుచర్ల మేనేజర్ నలమాద రవి కుమార్ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, మిగతా విషయాలు పూర్తి దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని యస్ ఐ పి వెంకట రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed