- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అన్న పై కత్తిపీటతో దాడి చేసిన తమ్ముడు
by Naresh |

X
దిశ, శాలిగౌరారం: అన్న పై కత్తిపీటతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పెర్క కొండారం గ్రామానికి చెందిన చర్లపల్లి రాంబాబు (27) అతని తమ్ముడు చర్లపల్లి నవీన్ ఇద్దరు మధ్యాహ్నం పూట ఇంట్లో నూతన ఇల్లు నిర్మాణం కోసం గొడవ పడ్డారు. దీంతో మాట మాట పెరిగి క్షణికావేశంలో అన్న పై కత్తిపీటతో తమ్ముడూ దాడి చేశాడు. వెంటనే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా పక్కనే ఉన్న గుండు రాయితో తలపై మోది హత్య చేసినట్లు తల్లి పద్మ తెలిపారు. సంఘటన స్థలాన్ని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నకిరేకల్ సీఐ రాజశేఖర్, శాలిగౌరారం ఎస్‌ఐ ఎం. ఐలయ్య తదితరులు పాల్గొని విచారణ చేస్తున్నారు.
Next Story