రజతోత్సవ సభకు ఉద్యమంలా కదలాలి : జగదీశ్ రెడ్డి

by Kalyani |
రజతోత్సవ సభకు ఉద్యమంలా కదలాలి :  జగదీశ్ రెడ్డి
X

దిశ, హుజూర్ నగర్ : ఈనెల 27వ తేదీన వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కార్యకర్తలంతా ఉద్యమంలా కదలిరావాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కోరారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అని అన్నారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. హుజూర్ నగర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ఈ విధంగా మాట్లాడారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. కేటీఆర్ పిలుపుతో స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు శ్రేణులంతా సిద్ధమవుతున్నారని తెలిపారు. రైతుబంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. ఆసరా పింఛన్లు పెంచలేదు ఉన్న పింఛన్లు సమయానికి ఇస్తలేరు ఇంకా వారు చేసేదేముందని ఎద్దేవా చేశారు.

నీళ్లు లేక ఎండిన పంటలు చేతికొచ్చిన పంటకు మద్దతు ధర లేక అన్నదాతలు అరిగోషలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రశాంత వాతావరణాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఇంకా మూడున్నర ఏండ్లున్న ఈ కాంగ్రెస్ పాలనలో ఎలా బతకాలని ప్రజలు చర్చించుకుంటున్నారని మాట్లాడారు. ఉద్యమ సమయంలో అందరి కష్టాలు తెలుసుకుని రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. విద్య వైద్యం ఉద్యోగం వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో ఎవరి నోట విన్న నేడు కేసీఆర్ మాటే వినిపిస్తుందన్నారు. గొప్ప నాయకత్వాన్ని కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి దూరం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని తెలిపారు. ఈ సమావేశంలో హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed