గ్రామ్య స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం:దేవరకొండ ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
గ్రామ్య స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం:దేవరకొండ ఎమ్మెల్యే
X

దిశ: దేవరకొండ: గ్రామ్య స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం అని దేవరకొండ శాసన సభ్యులు,బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ్య స్వచ్ఛంద సంస్థ 30 వార్షికోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడుతూ.బాలికలకు ఉన్నత విద్యను అందించేందుకు అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛన్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కిందని అని ఆయన అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని ఆయన సూచించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, బానిస బతుకులు మారాలి అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్ గౌడ్,వైస్ ఎంపీపీలు చింతపల్లి సుభాష్,అరే కంటి ముత్యాలమ్మ రాములు,సర్పంచులు అనురాధ,లక్ష్మీ,ఎంపీటీసీ కొర్ర గౌతమి రాంసింగ్,గ్రామ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ రుక్మిణి,వేముల రాజు,బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed