గృహ జ్యోతి పేరు లేదా...?

by Naresh |
గృహ జ్యోతి పేరు లేదా...?
X

దిశ, తుంగతుర్తి: గృహ జ్యోతి పథకంలో అర్హులైన వారి పేర్లు లేని పక్షంలో తగిన ఆధారాలతో తుంగతుర్తి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని విద్యుత్ శాఖ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుపు రేషన్, ఆధార్, విద్యుత్ బిల్లు నెంబరు, ప్రజా పాలన దరఖాస్తు జిరాక్సులను ఎంపీడీవోకు సమర్పిస్తే ఆన్ లైన్ సర్టిఫికెట్ ఇస్తారని ఈ మేరకు ఆ సర్టిఫికెట్‌ను తమ కార్యాలయంలో అందజేస్తే జీరో బిల్లు జాబితాలో చేరుస్తామని ఆయన వివరించారు. ఇది ఇలా ఉంటే మండల పరిధిలో గృహ, వ్యవసాయ రంగాలకు ఎలాంటి అంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. సమస్యలు ఏవైనా ఉంటే తనకు (సెల్ నెంబర్ 9440816323) గాని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ (9491065884) కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.



Next Story

Most Viewed