అత్యధికంగా పోలింగ్ అక్కడే....!

by Naresh N |
అత్యధికంగా పోలింగ్ అక్కడే....!
X

దిశ, తుంగతుర్తి: తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని 9 మండలాల పరంగా నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తంగా రెండు లక్షల 55 వేల 017 ఓట్లు ఉండగా రెండు లక్షల 23 వేల 496 ఓట్లు (87.64 శాతం) పోలయ్యాయి. ఇందులో పురుషులు ఒక లక్ష 13 వేల 312 కాగా మహిళలు ఒక లక్ష 10 వేల 181 మంది ఉన్నారు. ఇక మండలాల పరంగా చూస్తే... మోత్కూర్ మండలంలో 26,953 మంది ఓటర్లు ఉండగా 22 వేల 881 మంది (84.89)ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే అడ్డగూడూరు మండలంలో 22 వేల 631 మంది ఓటర్లు ఉండగా ఇందులో 20వేల 036 మంది (88.53) ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాలిగౌరారం మండలంలో 39వేల 386 మంది ఓటర్లు ఉండగా 34 వేల 240మంది (86.93)ఓటు హక్కు వినియోగించు కున్నారు.జాజిరెడ్డిగూడెం మండలంలో 23 వేల 826 మంది ఓటర్లు ఉండగా 21 వేల 453 మంది (90.04) ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూతనకల్ మండలంలో 28 వేల 135 మంది ఓటర్లు ఉండగా 24 వేల 682 మంది (87.73) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మద్దిరాల మండలంలో 24 వేల 665 మంది ఓటర్ల గాను 21 వేల 582 మంది (87.50), తుంగతుర్తి మండలంలో 33 వేల 397 మంది ఓటర్ల గాను 29వేల 211 (87.47) నాగారం మండలంలో 23 వేల 691 మంది ఓటర్లకు గాను 20వేల 630 (87.08) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే తిరుమలగిరి మండలంలో 32వేల 333 మంది ఓటర్లకు గాను 28 వేల 781 (89.01) మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డి, సహాయక అధికారి యాదగిరి రెడ్డిలు “దిశ”కు వివరించారు.

2018 కంటే పెరిగిన పోలింగ్....

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. అయితే ఇక్కడో విశేషం ఏమిటంటే. ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య రెండు లక్షల 31 వేల 376 ఉంది. ఈ మేరకు 1 లక్ష 98 వేల 766 ఓట్లు పోలింగ్ అయ్యాయి. అంటే 85.906 శాతంగా నమోదయింది. ఆనాడు తుంగతుర్తి మండలంలో అత్యధికంగా 87.440 ఓట్ల శాతం నమోదయితే ఈసారి జాజిరెడ్డిగూడెం మండలంలో 90.04 శాతం నమోదయింది.



Next Story