- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుప్త నిధుల కలకలం..విగ్రహం పెకిలించి మరీ..!

దిశ,నల్లగొండ : తిప్పర్తి మండల పరిధిలోని పజ్జూరు గ్రామంలో శుక్రవారం రాత్రి పురాతన 12,13 శతాబ్దాలనాటి నాగ శిలా విగ్రహాన్ని దుండగులు తవ్విన సంఘటన చోటు చేసుకుంది. 3000 వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగి పజ్జూరు గ్రామం చుట్టూ విగ్రహాలు ప్రతిష్టించబడి నాటి శిల్ప కళా సంస్కృతి క వైభవానికి చారిత్రక నేపథ్యానికి సాక్షీభూతంగా ఉన్నాయి.తరతరాలుగా గ్రామ ప్రజలు వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గడ్డపారలతో తవ్వి పెకిలించి విగ్రహం కింద సుమారుగా మీటరు లోతు గుంత తీశారు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తుడు జంజిరాల సైదులు సంఘటన స్థలాన్ని చూసి గ్రామ మాజీ సర్పంచ్ మోయిజ్, గ్రామ ముఖ్యులకు విషయం తెలియజేయడంతో విగ్రహం దగ్గరకు వెళ్లి పరిశీలన చేసి ఉన్నతాధికారులకు విషయం తెలియపరిచారు. వారు మాట్లాడుతూ పురాతన వారసత్వ సంపద ను కాపాడుకోవాలి.తెలంగాణ నేలమీద ఏ గ్రామాన్ని చూసిన గత చారిత్రక అవశేషా ఆధారాలు కనపడుతాయి. మానవుడి జీవన పరిణామం, సంస్కృతిక ఆచార రీతులను తెలియజేసే ఆధారాలను దుండగులు గుప్త నిధులు ఉంటాయి అనే భ్రమలో చరిత్రను ధ్వంసం చేస్తున్నారు. ఇది చాలా తప్పు, పురాతన విగ్రహల క్రింద ఎలాంటి నిధి నిక్షేపాలు వుండవు అనే విషయం గమనించాలి ఇలా త్రవ్వకాలు జరిపే మూర్ఖుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి అని అన్నారు.