గ్రామీణ వైద్యుల సమస్యలన్నింటిని ప్రభుత్వం పరిష్కరిస్తుంది : వంగవీటి రామారావు

by Sumithra |
గ్రామీణ వైద్యుల సమస్యలన్నింటిని ప్రభుత్వం పరిష్కరిస్తుంది : వంగవీటి రామారావు
X

దిశ, కోదాడ : గ్రామీణ వైద్యుల సమస్యలన్నింటిని ఎమ్మెల్యే పద్మావతి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ వైద్యుల పై దాడులు జరగడం బాధాకరమని గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పిస్తామన్నారు. గ్రామాల్లో పేదప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడే దేవుళ్ళు గ్రామీణ వైద్యులు అని కొనియాడారు.

గ్రామీణ వైద్యులకు ఫస్ట్ ఎయిడ్ చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ను అందించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని వర్తింప చేస్తామన్నారు. కోదాడలో గ్రామీణ వైద్యుల సంఘం భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేయించాలని సంఘం పక్షాన విజ్ఞప్తి చేయగా స్పందించిన ఆయన ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో సంఘ భవనానికి స్థలం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అమరులైన ఆర్ఎంపీలకు ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సీనియర్ గ్రామీణ వైద్యులకు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర నాయకులు డాక్టర్ బ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోపాల లక్ష్మీ నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సరికొండ నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి రాజేందర్, జిల్లా సహాయ అధ్యక్షులు రహిమతుల్లా, జిల్లా కోశాధికారి జెర్రీపోతుల లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు, మండలాల అధ్యక్షులు శ్రీరాములు, సైదులు, వెంకటప్ప చారి, మురళీకృష్ణ, సైదులు, బిక్షం, కోదాడ మండల ఇన్చార్జిలు విక్రమ్, తుమాటి రామకృష్ణ, గోవింద నవీన్ కుమార్, హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు మన్సూర్ అలీ, అనంత రాములు సాంబయ్య చారి, రమేష్ పలు మండలాల జిల్లాల బాధ్యులు తదితరులున్నారు.



Next Story

Most Viewed