- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లారీ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
by Aamani |

X
దిశ,కోదాడ : లారీ పూర్తిగా దగ్ధం కావడం తో పెను ప్రమాదం తప్పింది. కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్ లో ఉన్న ఓ ట్రాన్స్పోర్ట్ లో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ లారీ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ట్రాన్స్పోర్ట్ ఆవరణలో సుమారు 20 కి పైగా లారీలు ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ పక్కనే పెట్రోల్ బంకులు సైతం ఉన్నాయి. ఫైర్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చిన వారు సకాలంలో స్పందించలేదని లారీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.మిగతా లారీలకు అంటుకొని ఉంటే పెద్ద పెను ప్రమాదమే సంభవించేదని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న లారీకి షార్ట్ సర్క్యూట్ కావడంపై, షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీ దగ్ధమైందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
Next Story