పెళ్లి పీటలపైనే వధువుకు ఇంజెక్షన్ వేసిన వైద్యుడు.. సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)

by Disha Web Desk 19 |
పెళ్లి పీటలపైనే వధువుకు ఇంజెక్షన్ వేసిన వైద్యుడు.. సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)
X

దిశ, ప్రతినిధి సూర్యాపేట: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇదే పాటిస్తూ ఓ పెళ్లి కొడుకు వివాహానికి ముందు అనారోగ్యంతో ఉన్న పెళ్లి కూతురుకి పెళ్లి పీటలపై ఇంజక్షన్ వేసి వైద్యం చేయించాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వివరాల్లోకెళ్తే.. ఆత్మకూరు ఎస్ మండలం దాచారం ఎక్స్ రోడ్డు వద్ద గల జయ వినాయక ఫంక్షన్ హాల్లో కోటపాడు గ్రామానికి చెందిన కొమర గోపి, బూరుగడ్డ గ్రామానికి చెందిన మాలిశ్వరి పెద్దలు కుదిర్చిన సమక్షంలో శనివారం వివాహం జరుపుకుంటున్నారు.

రెండు రోజులుగా పెళ్లికూతురుకి జ్వరం వస్తుండడంతో అనారోగ్యంగా ఉందని గమనించిన పెళ్ళికొడుకు.. అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ వీరన్నకు ఫోన్ చేశాడు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ పెళ్లి మండపం వద్దకు వెళ్లి.. వధువుని పరీక్షించి జ్వరం ఉందని తెలిపాడు. అప్పటికే బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు పెళ్లికి చేరుకున్నారు. మళ్లీ హాస్పిటల్‌కి వెళ్తే పెళ్లి ఆగిపోద్దని, వండిన వంటలు ఆగం అయిపోతాయని అని భావించాడో ఏమో మరీ.. చేసేది ఏమీ లేక పెళ్లి పీటలపైనే పెళ్లి కూతురికి ఇంజక్షన్ వేయించాడు. డాక్టర్ ఇంజక్షన్ వేస్తున్న దృశ్యాన్ని అక్కడున్న కెమెరామెన్ తన కెమెరాలో బంధించాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగా హల్చల్ చేస్తుంది.

Read Disha E-paper

Next Story