భువనగిరిలో బీఆర్ఎస్‌కు షాక్.. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పైళ్ల శేఖరరెడ్డి

by Disha Web Desk 16 |
భువనగిరిలో బీఆర్ఎస్‌కు షాక్..   కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పైళ్ల శేఖరరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కౌంటింగ్ ముగియకుండానే లెక్కింపు కేంద్రాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు వెళ్లిపోతున్నారు. భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ విజయం వైపు దూసుకుపోతున్నారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు విజయం తమదేనంటూ సంబురాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. కాంగ్రెస్ ముందంజలో ఉండగా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు వెనుకంజలో కొనసాగుతున్నారు.Next Story

Most Viewed