అక్కంపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్..

by Sumithra |
అక్కంపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్..
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి : అక్కంపల్లి రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లను వేసిన ఘటనా స్థలాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను ఎవరు వేశారని ఏ విధంగా వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, జలమండలి, అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరిశీలించి వివరాలను వెల్లడించాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిందన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. కలెక్టర్ తో పాటు దేవరకొండ ఏఎస్పీ మౌనిక, ఆర్డిఓ రమణారెడ్డి, ఇరిగేషన్ అధికారులు మండల అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed