- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అక్రమార్కుల పై చర్యలు వేగవంతం చేసిన కలెక్టర్
దిశ, నల్లగొండ: నల్లగొండలో 59 జీఓ అడ్డం పెట్టుకొని కొందరు జర్నలిస్టులు నల్లగొండ జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో అక్రమాల పై హౌసింగ్ సొసైటీ చేసిన ఫిర్యాదును జిల్లా కలెక్టర్, జేసీల సమక్షంలో స్పష్టమైన హామీ లభించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, జేసీ శ్రీనివాస్‌ల ఉమ్మడి సమావేశంలో జర్నలిస్ట్‌లకు హోసింగ్ సొసైటి ఫిర్యాదు మేరకు రెండు మూడు రోజుల్లో మరోమారు నోటీసులు జారీ చేసి విచారణ పూర్తి చేయడం ద్వారా న్యాయం చేస్తామని కలెక్టర్, జేసీలు స్పష్టం చేశారు. హౌసింగ్ సొసైటి ప్రతినిధులు సాధ్యమైనంత త్వరగా విచారణ తేదీని ప్రకటించి ఆలస్యమవుతున్న విచారణను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఎన్నికల విధుల కారణంగా కొంత ఆలస్యమైందని, మొత్తానికి వారం రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.