బస్టాండ్ ఇలా.. ప్రయాణం సాగేది ఎలా..?

by Disha Web Desk 23 |
బస్టాండ్ ఇలా.. ప్రయాణం సాగేది ఎలా..?
X

దిశ, మర్రిగూడ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మర్రిగూడ బస్టాండ్ నీరు నిలిచి కుంటను తలపిస్తుంది. గత కొన్ని నెలలుగా గుంతల మయంగా ఉన్నా ప్రయాణ ప్రాంగణం వర్షపు నీరు చేరగానే చిన్నపాటి కుంటలను పోలిన మాదిరిగా నీరు నిలిచి అసౌకర్యంగా ఉంటుంది. వాహనాలు వచ్చి పోయేటప్పుడు నీరంతా రోడ్ల మీదకు రావడం ప్రయాణికులు మీద పడటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గుంతలు పూడ్చి వేయాల్సిన నాయకులు పట్టించుకోకపోవడంతో గుంతలు పెద్ద పెద్ద గుంతలు గా ఏర్పడ్డాయి. దీంతో చిన్నపాటి వర్షం వచ్చిన గుంతలో నీరు చేరి కుంటల మాదిరిగా తలపిస్తున్నాయి . వచ్చిపోయే వాహనాలతో బురద నీరు ప్రయాణికులపై వాహనాలపై వాడటంతో శాపనార్ధాలు పెడుతున్నారు. గుంతలు పూడ్చడానికి పెద్ద ఎత్తున ఖర్చు రాకున్నా వాటిని పూడ్చడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అసౌకర్యంగా ఉన్న ఈ బురద గుంతలను ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పూడ్చివేసి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Next Story